కూకట్‌పల్లి ప్రగతి నగర్‌లోని నియో గీతాంజలి (Neo Geetanjali School) పాఠశాలలో నిర్వహించిన వేడుకలు అంబరాన్నంటాయి. ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యం పలు పోటీలను నిర్వహించింది. ఈ పోటీల్లో విద్యార్థుల తల్లులు, పాఠశాల ఉపాధ్యాయినిలు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. Ramp walk, Fireless cooking , Dance మొదలైన ఆటపాటలతో సందడిగా గడిపారు. వేడుకల్లో భాగంగా విద్యార్థుల సాంస్కృతి ప్రదర్శన అతిథులను ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం , శైలజ దామెర, రమాదేవి పేర్ని, సుప్రియ సాహు పాల్గొని పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులను అందజేశారు.